‘పచ్చీస్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన పాపులర్ స్టైలిస్ట్ రామ్జ్ తన రెండవ సినిమా ‘ఫైటర్ రాజా’ని కృష్ణ ప్రసాద్ వత్యం దర్శకత్వంలో చేస్తున్నారు. రన్‌వే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.2గా దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన మేకర్స్ గురువారం హీరో విశ్వక్సేన్ చేతుల మీదుగా టీజర్‌ని లాంచ్ చేయించారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ,’ఈ సినిమాకి సంబంధించిన ప్రతీదీ చాలా ప్రామెసింగ్గా ఉంది. పోస్టర్ డిజైన్, కలర్ గ్రేడింగ్, విజువల్స్ అన్నీ బావున్నాయి. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా రోజుల తర్వాత చంద్రశేఖర్ యేలేటి సినిమా వైబ్ ఈ టీజర్లో కనిపించింది. టీజర్ చాలా ఇంపాక్ట్ ఫుల్‌గా ఉంది’ అని తెలిపారు. ‘లవ్, మనీ, ఫ్యామిలీ ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం ఫైటర్ రాజా. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది’ అని హీరో రామ్జ్ చెప్పారు.