– పైలట్లు సురక్షితం
శివపురి: మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. భారత వైమానిక దళానికి చెందిన ట్విన్ సీటర్ మిరాజ్ 2000 ఫైటర్ జెట్ గురువారం మధ్యాహ్నం శివపురిసమీపంలో కూలిపోయింది. శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన విమానం ప్రమాదవశాత్తూ బహ్రేటా సాని గ్రామ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కుప్పకూలింది. ఫైటర్ జెట్ కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అయితే, అద ృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. గాయపడ్డ పైలట్లను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.