బాలకష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందుతున్న మూవీ ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈనెల 19న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో వరంగల్‌లో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. దర్శకులు వంశీపైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకష్ణ మాట్లాడుతూ,’నేను తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ మాండలికంలో మాట్లాడాను. బాలకష్ణ సినిమా అంటే పంచభక్ష పరమాన్నాలు ఉన్న భోజనంలా అన్నీ ఉండాలి. ఇందులో కూడా అన్నీ ఉంటాయి. టోటల్ గా డిఫరెంట్ సినిమా ఇది. ట్రైలర్లో మీరు చూసింది కొంతే. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. అదంతా దాచి పెట్టాం. దసరాకి ముందు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాం. దసరాకి ముందు దంచుదాం. కాజల్ వెర్సటైల్ నటి. ఇందులో చాలా చక్కని పాత్రని పోషించారు. శ్రీలీల ఇందులో నన్ను చిచ్చా చిచ్చా అని పిలుస్తుంది. ఇందులో చేసిన పాత్ర ఆమె కెరీర్లో గుర్తుండిపోతుంది. ఇందులో అర్జున్ రాంపాల్‌తో నటించడం గొప్ప అనుభూతి. మా ఇద్దరి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. నా సినిమా అంటే తమన్‌కి పూనకం వస్తుంది. బాక్సు బద్దలైపోయేలా కొడతాడు. ఈ సినిమా చూసి మగాళ్ళు సైతం కన్నీళ్ళు పెట్టుకొని బయటికి వస్తారు. అంత అద్భుతంగా మా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాని తీర్చిదిద్దారు. మంచి పాటలు, ఫైట్లు, డైలాగులు, యాక్షన్ సీన్స్స్తో సినిమా అంతా ఒక పండగలా ఉంటుంది’ అని తెలిపారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ‘షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాతలు హరీష్, సాహుకి థ్యాంక్స్. బడ్జెట్, మేకింగ్ పరంగా నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. దాని రిజల్ట్ అవుట్ పుట్ ఈనెల 19న ప్రేక్షకులు చూస్తారు. ఈ సినిమా నా కెరీర్లో శానా యేండ్లు యాదుంటుంది. బాలయ్య ఎన్నో గుర్తుండి పోయే పాత్రలు చేశారు. నటన ఆయనకు కొత్త కాదు. కానీ ఓ కొత్త పాత్ర ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్‌లా కష్టపడి పని చేసి, నేను పేపర్ మీద రాసిన దాని కంటే వెయ్యిరెట్లు అద్భుతంగా చేశారు.ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. భగవంత్ కేసరి పాత్రతో చాలా జర్నీ చేస్తారు’ అని అన్నారు.
‘ఈ సినిమాని బాలకష్ణ అభిమానులతో పాటు ఫ్యామిలీస్ అందరూ ఎంజారు చేస్తారు. ఇది మా ప్రామీస్. ఈ సినిమా మా బ్యానర్లో బెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని నిర్మాత సాహూ గారపాటి చెప్పారు.
ఇందులో నేను వరంగల్ అమ్మాయిగా కనిపిస్తాను. సోల్ కనెక్ట్ ఉన్న విజ్జి అనే అందమైన పాత్ర ఇచ్చిన అనిల్ రావిపూడికి చాలా థ్యాంక్స్. బాలకష్ణతో పని చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇందులో చాలా అందమైన సీన్స్ ఉన్నాయి.
– శ్రీలీల
ఈ సినిమా నాకు చాలా స్పెషల్. బాలయ్యతో,అనిల్ రావిపూడితో వర్క్ చేయడం గౌరవంగా, ఆనందంగా ఉంది.
– కాజల్