నిర్మాతగా నా లక్ష్యాన్ని నెరవేర్చే సినిమా

A film that fulfills my mission as a producer‘మంచి సినిమాలు తీయాలనే తపన, లక్ష్యంతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఆ ప్రయత్నంలో భాగంగానే తీసిన సినిమా ‘క” అని నిర్మాత చింతా గోపాల కృష్ణారెడ్డి అన్నారు. హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్‌ థ్రిల్లర్‌ ‘క’. నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై  చింతా గోపాలకష్ణ రెడ్డి నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్‌, సందీప్‌ తెరకెక్కించారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా ఈనెల 31న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ  నేపథ్యంలో నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి మీడియాతో చిత్ర విశేషాలను షేర్‌ చేసుకున్నారు. మాది రాజమండ్రి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి  పాటలు వినడం ఇష్టం. అలా సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. వత్తిపరంగా వ్యాపారవేత్తగా మారినా, సినిమాల మీద ఇంట్రెస్ట్‌ అలానే ఉండిపోయింది. లాక్‌డౌన్‌ టైమ్‌లో ‘ఇప్పుడు  కాక ఇంకెప్పుడు’ అనే సినిమా చేశాను. ఆ తర్వాత సమంత నటించిన ‘యశోద’ సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాను. ఆ సినిమాతో ఇండిస్టీలో కొద్దిగా గుర్తింపు  తెచ్చుకున్నా. హీరో కిరణ్‌ అబ్బవరంపై నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన ద్వారా ఈ ప్రాజెక్ట్‌ నా దగ్గరకు వచ్చింది. ఈ కథ విన్నప్పుడు కంటెంట్‌ చాలా కొత్తగా ఉంది  అనిపించింది. ఇందులో సస్పెన్స్‌, సెంటిమెంట్‌ ఉన్నాయి. ఇద్దరు దర్శకులు సుజీత్‌, సందీప్‌ స్క్రిప్ట్‌ బాగా నెరేట్‌ చేశారు. వాళ్లు చెబుతుంటే బాగా చేయగలరు అనే నమ్మకం  కుదిరింది. షూటింగ్‌ తర్వాత అవుట్‌ఫుట్‌ చూసి ఇంప్రెస్‌ అయ్యాను. కథను వాళ్లు మలుపు తిప్పిన విధానం బాగా నచ్చింది. అలాగే వాళ్ళు రాసిన డైలాగ్స్‌ చాలా అర్థవంతంగా  ఉన్నాయి. దీనికి సీక్వెల్‌ కూడా చేసుకోవచ్చు. టీజర్‌, ట్రైలర్‌, పాటలు బాగా బజ్‌ క్రియేట్‌ చేశాయి. దీంతో నిర్మాత వంశీ నందిపాటి ఈ సినిమాని ఏపీ, తెలంగాణలో రిలీజ్‌  చేసేందుకు ముందుకొచ్చారు. 350కి పైగా థియేటర్స్‌లో విడుదలవుతోంది. మా సంస్థ నుంచి కొత్త ప్రాజెక్ట్‌ జనవరిలో ఫైనల్‌ చేస్తాను. చింతా గోపాలకష్ణ రెడ్డి సినిమా వస్తుందంటే  అది మంచి సినిమానే అయి ఉంటుందనే పేరు తెచ్చుకోవాలనేదే నిర్మాతగా నా లక్ష్యం. నా లక్ష్యాన్ని ‘క’ కచ్చితంగా నెరవేస్తుంది.