తెలుగులో ఇప్పటివరకు రాని సినిమా

తెలుగులో ఇప్పటివరకు రాని సినిమాహీరో సుధీర్‌ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ జి నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి ‘సెహరి’ ఫేమ్‌ జ్ఞానసాగర్‌  ద్వారక దర్శకత్వం వహించారు. ఈనెల 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. యువ హీరోలు అడివి శేష్‌, విశ్వక్‌ సేన్‌  ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మహేష్‌ బాబుతో సుధీర్‌ బాబు ఆడియో ఇంట్రాక్షన్‌ని రిలీజ్‌ చేశారు. ఆడియో  ఇంట్రాక్షన్‌లో మహేష్‌ బాబు మాట్లాడుతూ, ‘సినిమా ట్రైలర్‌ చూశాను. చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. సుధీర్‌ బాబు చాలా కొత్తగా కనిపించారు. బ్యాగ్‌ డ్రాప్‌, ప్రిమైజ్‌ కొత్తగా  ఉంది. ఈ రోజుల్లో ఆడియన్స్‌ ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌ని ఇష్టపడుతున్నారు. టైటిల్‌ ట్రాక్‌ చాలా నచ్చింది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని  మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘మహేష్‌ బాబు బిజినెస్‌ మ్యాన్‌ సినిమాలో ‘నీ టార్గెట్‌ టెన్‌ మైల్స్‌ అయితే ఏమ్‌ ఫర్‌ ది లెవంత్‌ మైల్‌’ అని ఉంటుంది.  నేను ట్వెల్త్‌ మైల్‌కి గురి పెట్టాను. కొట్టాను. ఒక సాలిడ్‌ సినిమా తీసి, ఎంతో మందికి చూపించి, వారు ఇచ్చిన ఫీడ్‌ బ్యాక్‌తో ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నాను. ఈ సీన్‌ ఎలా తీస్తే  పగిలిపోతుంది, ఈ ఫ్రేం ఎలా చూస్తే అదిరిపోతుందనే అప్రోచ్‌తో ఈ సినిమా చేశాం. ట్రైలర్‌లో చూస్తున్న ప్రతి డిటైల్‌కి టీం అందరి ఎఫర్ట్‌ ఉంది. ఇప్పటివరకూ తెలుగు  ఇండిస్టీలో ఇలాంటి బ్యాక్‌ డ్రాప్‌తో ఎలాంటి సినిమా రాలేదు. సినిమా చూసినప్పుడు ఆడియన్స్‌ ఇదే ఫీల్‌ అవుతారు. మా మావయ్య సూపర్‌స్టార్‌ కష్ణ కోరుకున్న సినిమా ఇది.  ఆయన నన్ను ఎలాంటి క్యారెక్టర్‌లో చూడాలని అనుకున్నారో అలాంటి సినిమా అని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను’ అని హీరో సుధీర్‌ బాబు చెప్పారు. డైరెక్టర్‌ జ్ఞానసాగర్‌  ద్వారక మాట్లాడుతూ,’ఇంత పెద్ద కాన్వాస్‌లో సినిమా చేయడం నిర్మాత ప్యాషన్‌ వలనే సాధ్యమైంది. సుధీర్‌ బాబు చాలా సపోర్ట్‌ చేశారు. ‘హరోం హర’ పక్కా గుర్తుండిపోయే  సినిమా అవుతుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా కోసం రెండేళ్ళు హార్డ్‌ వర్క్‌ చేసాం. ఈ రెండేళ్ళ హార్డ్‌ వర్క్‌ ఈనెల14న పే చేస్తుందని గట్టి నమ్మకంలుంది. ట్రైలర్‌కి వచ్చిన  రెస్పాన్స్‌ థియేటర్‌లో సినిమాకి వస్తుంది’ అని ప్రొడ్యూసర్‌ సుమంత్‌ చెప్పారు. మరో ప్రొడ్యూసర్‌ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ,’ఇందులో తండ్రీ కొడుకుల ఎమోషన్‌ నాకు పర్సనల్‌గా చాలా కనెక్ట్‌ అయ్యింది. ఇది కమర్శియల్‌ మాస్‌ మూవీ. సాగర్‌ అద్భుతంగా తీశారు. విజువల్స్‌, మ్యూజిక్‌ సినిమాకి హైలెట్‌గా ఉంటాయి. సుధీర్‌ బాబు అద్భుతంగా చేశారు. చాలా కొత్తగా కనిపిస్తారు’ అని అన్నారు.