ఓటు విలువ చెప్పే చిత్రం

vote
Tell the value
pictureహతిక్‌ శౌర్య హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఓటు’. ‘చాలా విలువైనది’ అనేది ట్యాగ్‌ లైన్‌. ఫ్లిక్‌ నైన్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు రవి. తాజాగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ ఈ చిత్రటీజర్‌ని విడుదల చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా ద్వారా సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటో టైటిల్‌లోనే తెలుస్తుంది. ఓటుకు డబ్బులు అడుక్కునే స్థాయికి దిగజారిపోయే పరిస్థితి ఉన్న సమాజానికి వెన్నుతట్టి లేపాల్సిన అవసరం ఉంది. అందుకు ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి సినిమాని నిర్మించిన చిత్ర బందానికి అభినందనలు. పాటలు చక్కగా ఉన్నాయి. ‘సిరిమల్లె పువ్వు’ పాటతో శ్రీదేవికి ఎంతపేరు వచ్చిందో ఈ సినిమాలో అలాంటి పాటలో నటించిన తన్వికి కూడా అలాంటి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని, సినిమాని సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
‘టీజర్‌ని లాంచ్‌ చేసిన ఆర్పీ పట్నాయిక్‌కి కతజ్ఞతలు. దర్శకుడు రవి నాపై ఎంతో నమ్మకం పెట్టారు. ఇది ప్రస్తుత సమాజానికి చాలా ముఖ్యమైన కథ . గోపరాజు రమణ ఈ సినిమాలో కీలక పాత్ర చేయడం మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది’ అని హీరో హతిక్‌ శౌర్య చెప్పారు. నాయిక తన్వి మాట్లాడుతూ,’ ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కతజ్ఞతలు. సినిమా చక్కగా వచ్చింది. ప్రేక్షకులంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నటుడు గోపరాజు రమణ మాట్లాడుతూ,’ఓటు ప్రాముఖ్యత జోడిస్తూ కుటుంబకథా చిత్రంగా ఈ సినిమాని మలిచిన దర్శక, నిర్మాతలకు అభినందనలు. ఇందులో నేను కీలక పాత్రలో నటించాను. హతిక్‌ శౌర్య, హీరోయిన్‌ తన్వి కొత్తవారైనప్పటికీ చాలా అనుభవం ఉన్న నటుల్లా బాగా నటించారు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఇందులో ఉన్నాయి’ అని చెప్పారు.