ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే చిత్రం

A film that will remain forever in the minds of the audience‘రెండు వారాలు క్రితం సాయి పల్లవి ఇంట్రో వీడియో చూశాను. అప్పుడే ‘అమరన్‌’ సినిమా చూడాలని డిసైడ్‌ అయ్యాను. ఇది చాలా అద్భుతమైన స్టోరీ. ఇలాంటి కథలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచి పోతాయి’ అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అన్నారు. హీరో శివకార్తికేయన్‌ నటించిన బయోగ్రాఫికల్‌ యాక్షన్‌ చిత్రం ‘అమరన్‌’. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నే  షనల్‌ ప్రొడక్షన్స్‌, గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌తో కలిసి కమల్‌ హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ నిర్మించారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌ ద్వారా  ఈనెల 31న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్‌ నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హీరో శివకార్తికేయన్‌  మాట్లాడుతూ, ‘ఇదొక రియల్‌ హీరో స్టోరీ. మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌, ఇందు రెబెకాల ట్రూ స్టోరీ. ఒక సోల్జర్‌ జీవితం ఎలా ఉంటుందో డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ అద్భు తంగా  చూపించారు. ఈ సినిమాలో నేను మేజర్‌ ముకుంద్‌ రోల్‌ చేశాను. కమల్‌హసన్‌ ఈ చిత్రాన్ని నిర్మించడంతో మరింత స్పెషల్‌ సినిమాగా మారింది’ అని తెలిపారు. ‘ఇది నేషనల్‌  వైడ్‌గా సెలబ్రేట్‌ చేసుకునే సినిమా. అందుకే భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా రిలీజ్‌ చేస్తున్నాం. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి అంకితభావంతో పని చేశారు’ అని దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి అన్నారు.
నేను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకి నచ్చాలని చాలా అంకితభావంతో పని చేస్తాను. ‘అమరన్‌’ లాంటి సినిమాతో మరోసారి మీ ముందుకు రావడం చాలా గర్వంగా ఉంది. ఇది రియల్‌ సోల్జర్‌ జర్నీ. ఇటీవల ఆర్మీ వాళ్లకి ఈ సినిమా చూపించినప్పుడు మా లైఫ్‌ కూడా ఇలాగే ఉందని చాలా ఎమోషనల్‌ అయ్యారు.
– హీరోయిన్‌ సాయి పల్లవి