సినిమా బండి క్రియేషన్స్, యుపిక్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ప్రాజెక్ట్ ‘111 గ్రీన్ జోన్’. విజయ రాఘవేంద్ర దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్ర టైటిల్ టీజర్, పోస్టర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ‘ఓ మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం. మంచి బడ్జెట్ ఉంటే పాన్ ఇండియా రేంజ్‌లో చేసే చిత్రమిది. ఎందుకంటే గ్రీన్‌జోన్ అనేది మన దగ్గరే కాదు.. ఇండియా అంతా ఉంది’ అని తెలిపారు. సంగీత దర్శకుడు యాండర్ లీ మాట్లాడుతూ,’కంటెంట్ పరంగా ఇది చాలా స్పెషల్ మూవీ. కల్చర్‌తో ముడిపడిన చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది’ అని అన్నారు. లిరిక్ రైటర్ చిత్రన్ మాట్లాడుతూ,’ఇది సమాజానికి ఉపయోగపడే సినిమా. చిన్న సినిమా అయినప్పటికీ ఇందులో ఉండే కంటెంట్ చాలా పెద్దది. ఇందులో పాటని చాలా ప్రేరణ ఇస్తూ రాయించారు డైరెక్టర్. చంద్రబోస్ పక్కన నా పేరు చూసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా’ అని చెప్పారు. ‘దర్శకుడు విజయ రాఘవేంద్ర చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. టీజర్‌లో వినిపించిన డైలాగ్‌లోని పెయిన్‌తో ఈ మోషన్ టీజర్ చేశాం. లీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. విజువల్‌గా కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది’ అని వీఎఫ్‌ఎక్స్ చందూ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ :ఎన్టీఆర్, సాహిత్యం : చంద్రబోస్, చిత్రన్.