కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం

సుధాకర్‌ కోమాకుల నటించిన హిలేరియస్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నారాయణ అండ్‌ కో’. చిన్నా పాపిశెట్టి దర్శకత్వంలో పాపిశెట్టి ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌, సుఖ మీడియా బ్యానర్‌ల పై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్‌ కూడా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. చివరి పంచ్‌ చాలా బాగుంది. వైబ్‌ చాలా బావుంది. ఆడియన్స్‌కి కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ‘దర్శకుడు చిన్నా ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజారు చేశాను. చాలా మంచి ఫన్‌ ఎంటర్‌ టైనర్‌ అనిపించి మొదలుపెట్టాం. నలుగురు సంగీత దర్శకులు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. అందరూ కలసి చేసిన చక్కని ఎంటర్‌ టైనర్‌ ఇది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా’ అని హీరో సుధాకర్‌ కోమాకుల చెప్పారు. ఆర్పీ పట్నాయక్‌ మాట్లాడుతూ,’నాకు తెలిసిన ఒక నిర్మాత ఈ సినిమా చూసి చాలా నచ్చింది, అవుట్‌ రేట్‌కి కొనాలని అనుకుంటున్నానని నాతో అన్నారు. టీం చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. వాళ్ళు లాభాలు చూడాలని దర్శక,నిర్మాత చిన్నా ఒక బోల్డ్‌ నిర్ణయం తీసుకున్నాడు. ఒక నిర్మాతకు అంతలా నచ్చిందంటే సినిమాలో ఏ రేంజ్‌ వినోదం ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని అన్నారు.