కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం

కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంవెన్నెల కిషోర్‌, నందితా శ్వేత, నవమి గాయక్‌, షకలక శంకర్‌, రజత్‌ రాఘవ్‌, నవిన్‌ నేని, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓఎంజీ) (ఓ మంచి ఘోస్ట్‌). మార్క్‌ సెట్‌ నెట్‌వర్క్స్‌ బ్యానర్‌ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 21న రాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. దర్శకుడు శంకర్‌ మార్తాండ్‌ మాట్లాడుతూ, ‘అనూప్‌ రూబెన్స్‌ వల్లే ఈ సినిమా ప్రారంభమైంది. మా మీద నమ్మకంతో అబినికా ఈ సినిమాను నిర్మించారు. అనూప్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌తో సినిమా నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లింది. మా ఆర్టిస్టులంతా కూడా అద్భుతంగా నటించారు. ఆండ్రూ కెమెరా వర్క్‌ బాగుంటుంది. ఫైట్‌ మాస్టర్‌ తక్కువ టైంలోనే మాకు కావల్సిన అవుట్‌ పుట్‌ ఇచ్చారు. ఆర్ట్‌ వర్క్‌ కూడా బాగుంటుంది. మా సినిమాను రిలీజ్‌ చేస్తున్న ఏసియన్‌ ఫిల్మ్స్‌, బాలాజీ ఫిల్మ్స్‌కి థ్యాంక్స్‌’ అని తెలిపారు. ‘నిర్మాతగా ఇది మాకు మొదటి చిత్రం. శంకర్‌ ఎంత బాగా కథ చెప్పారో.. అంతకు మించి అనేలా సినిమాను తీశారు. అందరూ చూడదగ్గ చిత్రమిది’ అని నిర్మాత డా.అబినికా ఇనాబతుని చెప్పారు. అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడుతూ, ‘కరోనా టైంలో శంకర్‌ నాకు ఈ కథను చెప్పారు. అప్పుడు చిన్నగా అనుకున్నారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సినిమా అద్భుతంగా వచ్చింది. వెన్నెల కిషోర్‌, నందిత, షకలక శంకర్‌ మధ్య సీన్లు బాగా వచ్చాయి. హర్రర్‌, కామెడీ మిక్స్‌ చేసి బాగా తీశారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. నందితా శ్వేత మాట్లాడుతూ, ‘నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. శంకర్‌ నాకు ఈ కథను చెప్పినప్పటి నుంచి ఎంతో ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. హర్రర్‌, కామెడీ జోనర్లతో రాబోతున్న ఈ మూవీని కుటుంబ సమేతంగా చూడొచ్చు. అందర్నీ నవ్వించేలా మా సినిమా ఉంటుంది’ అని తెలిపారు.