
మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ ను తహసిల్దార్ నారాయణ సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి పట్టుకున్నారు. రెంజల్ మండలం నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. టిప్పర్ యజమానికి మంగళవారం 20వేల జరిమానా విధించినట్లు తెలిపారు. అక్రమంగా మొరం, ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఎమ్మార్వో నారాయణ తెలిపారు.