
– నాసిరకం పనుల వల్లే ప్రమాదం
– ఎవరికైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు
– సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
నవతెలంగాణ – సిద్దిపేట
సిద్ధిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద అధికారుల నిర్లక్ష్యం కారణంగా నూతనంగా నిర్మిస్తున్న డైనోసార్ పార్కు వద్ద అగ్ని ప్రమాదం జరిగి దగ్ధం అయినట్లు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో ఆయన మాట్లాడుతూ నాసిరకం పనుల వల్లే డైనోసార్ పార్క్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిందని ఆరోపించారు. కోమటి చెరువు వద్ద ప్రజలు చూసేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారని అన్నారు. మంటలు వ్యాపించి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరని అన్నారు. ప్రజల డబ్బులను దుర్వినియోగం చేసేందుకే ఇలాంటి నాసిరకం పనులు చేస్తున్నారని అన్నారు. విషయాన్ని బయటకి పోనివ్వకుండా అధికారులు మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు పలువురిని బెదిరించారని అన్నారు. నాసిరకమైన పనులు చేస్తున్న కాంట్రాక్టర్ అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రమాదం జరిగితే బయటికి తెలియనియకుండా బెదిరింపులకు పాల్పడడం మంచి పద్దతి కాదని అన్నారు.