యూనివర్సిటీ లైబ్రెరీ స్విచ్ బోర్డులో చెలరేగిన మంటలు..

A fire broke out in the switch board of the university library.నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లోని గ్రంథాలయంలోని  స్విచ్ బోర్డులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. విద్యార్థులంతా చదువుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే సిబ్బంది వచ్చి మెయిన్ ఆఫ్ చేశారు. కొద్దిసేపటికే మంటలు తగ్గుముఖం పట్టాయి. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.