చింతలపల్లెలో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన గడ్డి కట్టలు…

నవతెలంగాణ- జన్నారం
జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 100 గడ్డి కట్టలు దగ్ధమయ్యాయి.ఆ గ్రామానికి చెందిన వాసాల రమేష్ కు చెందిన గడ్డి కట్టలలో సోమవారం మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్, సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పి వేశారు. సకాలంలో మంటలను ఆర్పి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఫైర్ అధికారి శ్రీనివాస్ వివరించారు. దాదాపు 5వేల వరకు నష్టం జరిగిందని రైతు వాసాల రమేష్ తెలిపారు.