చిల్లర దుకాణంలో అగ్నిప్రమాదం…


– అనుమానాస్పదంగా ఘటన…
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఓ చిల్లర దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదం అనుమానాస్పదంగా అనిపిస్తుంది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మండలంలోని పేరాయిగూడెం పంచాయితీ అల్లి గూడెం రోడ్ లో తగరం రాజేష్ అనే వ్యక్తి చిల్లర దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం రోజువారి మాదిరిగానే దుకాణం రాత్రి 10 గంటలకు మూసివేసారు. 11 గంటలకు స్థానికి పరిశ్రమలో విధులు ముగించుకుని వస్తున్న స్థానికులు ఈ అగ్ని ప్రమాదాన్ని గుర్తించి రాజేష్ ను కేకలు వేసి నిద్ర లేపారు. మేలుకున్న రాజేష్ మంటలు అదుపు చేసారు. అయితే సంఘటనకు చెందిన ఆనవాళ్ళను బట్టి గుర్తుతెలియని వ్యక్తి మూసి ఉన్న షాపు సెట్టర్ కింది నుండి పెట్రోల్ ను పోసి అగ్గిపుల్ల గీసి వెలిగించాడు. గీసిన అగ్గిపుల్ల, ముందుగానే ప్లాన్ ప్రకారం తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ షాపుకు కొంచెం దూరంలో పడవేసి ఉన్నాయి. ఈ ప్రమాదంలో రోజువారీ‌ విక్రయాలు నిమిత్తము నిల్వ ఉంచిన కిరాణా సరుకులు, ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లింది అని ఆవేదన వెలిబుచ్చాడు. ఈ విషయంపై బాధితుడు అతని కుటుంబీకులు జరిగిన ఘటనపై స్థానిక పోలీస్ లకు పిర్యాదు చేసారు.