అహంకారానికి తగిన గుణపాఠం

to pride
An appropriate lesson– బీఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరించారు..కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ
–  నాగార్జునసాగర్‌ రూపంలో సెంటిమెంట్‌కు జగన్‌ కుట్ర: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేసీఆర్‌ అహంకారం, అవినీతికి తెలంగాణ ప్రజలు తగిన గుణ పాఠం చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. శుక్రవార హైదరాబాద్‌లోని ముగ్దుం భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలతో పాటు క్షేత్ర స్థాయిలో తమకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్‌ పూర్తి మెజార్టీ సాధిస్తుందని అంచనా వేశారు. పదేండ్ల టీఆర్‌స్‌ పాలనలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. వందల ఎకరాలున్న భూస్వాములకు రైతుబంధు కొమ్ము కాస్తె, దళిత బంధులో మితిమీరిన అవినీతి, ధరణిలో భూదందాలు, ఉద్యోగాల భర్తీలో అవకతవకలు, వెరసి బీఆర్‌ఆస్‌ ప్రభుత్వాన్ని బొంద పెట్టాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు అవినీతినైనా సహిస్తారు కాని అహంకారాన్ని, నిరంకుశత్వాన్ని సహించరని అన్నారు పదేండ్ల టీఆర్‌స్‌ పాలనలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. వందల ఎకరాల భూములున్న భూస్వాములకు రైతుబంధు పేరిట కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును దానం చేయడం, దళిత బంధులో మితిమీరిన అవినీతి, ధరణిలో భూదందాలు, ఉద్యోగాల భర్తీలో అవకతవకలు, వెరసి బీఆర్‌ఆస్‌ ప్రభుత్వాన్ని బొంద పెట్టాయని తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్‌ పార్టీ అంతర్గతవ్యవహారమని, ఎక్కువ పోటీ ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటుందని అన్నారు. హైదరాబాద్‌లో పోలింగ్‌ తక్కువగా నమోదు కావడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయం నుంచి కూడా నగర వాసులు ఓటింగ్‌ పట్ల విముఖతను ప్రాదర్శిస్తున్నారని ఉన్నారని గుర్తు చేశారు. చదువుకున్న నగర ఓటర్ల కంటె గ్రామీణ ప్రాంత ఓటర్లలోనే రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉందని తెలిపారు. ఎన్నికల చివరి క్షణంలో నాగార్జున సాగర్‌ రూపంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సెంటిమెంట్‌ రగిల్చే కుట్ర చేసినప్పటికి తెలంగాణ ప్రజలు ఆ ఉచ్చులో పడలేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణాలకంటే గ్రామీణ ప్రాంత ప్రజలు బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనీ, ఓటింగ్‌ సరళిని బట్టి ఈ విషయం అర్థమవుతుందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్‌ ప్లాన్‌లను తీసేసి అనవసరమైన పథకాలను ప్రవేశ పెట్టారని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్‌ తన నిరంకుశత్వ, అహంకార ధోరణిని మార్చుకోవాలని సూచించారు. ఈ విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు బాల మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.