తొలిసురి బిడ్డకు ఫిక్స్డ్ బాండ్ అందజేత

A fixed bond is given to the first child– తాళ్లపల్లిలో ఫిక్స్డ్ బాండ్ పంపిణీ చేసిన కత్తి కార్తీక గౌడ్
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
ఆడపిల్ల బరువు కాదు ,ఆడపిల్ల బహుమానమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ అన్నారు. శనివారం అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన చంద్రగిరి రేఖ రాజు ల దంపతులకు తొలి ఆడబిడ్డ జన్మించింది.ఈ సందర్భంగా పాప పేరు మీద రూ.5 వేల పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ను అందజేశారు. టీం కత్తి కార్తీక ఫౌండేషన్ తరపునా దుబ్బాక నియోజకవర్గంలో దంపతులకు తొలిసురుగా జన్మించిన బిడ్డ పేరుమీద ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోతారెడ్డిపేట్ మాజీ ఎంపీటీసీ యాదగౌడ్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దేవరాజ్,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోత్త దేవి రెడ్డి,మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.