ఆశాలకు 18 వేల పిక్స్డ్‌ వేతనం అమలు చేయాలి

– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సలీం
నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్‌
వైద్య ఆరోగ్య శాఖలో ప్రజలకు అనేక రకాల ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్స్‌ కు 18 వేల ఫిక్స్డ్‌ వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు యం.డి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం ఆశా వర్కర్ల ఆరో రోజు సమ్మె సందర్భంగా తిప్పర్తి లో సెంటర్‌ నుండి ఎమ్మార్వో ఆఫీస్‌ వరకు ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో ఆఫీస్‌ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గత 18 ఏండ్ల నుండి పనిచేస్తున్నారు. ఆశాలకు పని భారం తగ్గించాలని, జాబ్‌ చార్టును విడుదల చేయాలని, 2021 జులై నుండి డిసెంబర్‌ వరకు ఆరు నెలల పిఆర్సి ఏరియర్స్‌ వెంటనే చెల్లించాలి, కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్‌ అలవెన్స్‌ నెలకు 1000 చొప్పున 16 నెలల బకాయిలు డబ్బులు వెంటనే చెల్లించాలి, 32 రకాల రిజిస్టర్స్‌ ను ప్రింట్‌ చేసి ప్రభుత్వం సప్లై చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల నాయకులు మంత్రాల మంగమ్మ, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు టి. పార్వతమ్మ, పులమ్మ, విజయ, రాజేశ్వరి, పుష్పలత, దనమ్మ, నిర్మల, పుష్ప, సైదమ్మ, జ్యోతి, పుష్పలత, సువర్ణ, సునీత, రుద్రమ్మ, వసంత, సుజాత, పద్మ, యల్లమ్మ, దుర్గా, రవేల, శైలజ, అరుణ, రమణ, బిక్షవమ్మ, రేణుకా, తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి: ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) నాంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు సమ్మెలో భాగంగా శనివారం తహసీల్దార్‌ కార్యాలయం నుండి నాంపల్లి బస్టాండ్‌ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యంమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ కనీస వేతనం అమలు అయ్యేంతవరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నాంపల్లి మండల ఉపాధ్యక్షురాలు ఏద్ళుల కవిత, మండల ప్రధాన కార్యదర్శి మెగావత్‌ సునీత, జిల్లా కమిటీ సభ్యురాలు కోరే లలిత, మమత, అరుణ, సునీత, శోభ, యాదమ్మ, అనిత, జ్యోతి, విజయలక్ష్మి, నీలిమ, రజిత, రాధిక, అండాలు, తదితరులు పాల్గొన్నారు.
పెద్దవూర :ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలనిప్రజానాట్యమండలి జిల్లా సహాయ కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య అన్నారు ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మె ఆరవరోజుకు చేరింది.ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకటమ్మ, జయమ్మ, కష్ణవేణి,మరియమ్మ,శోభారాణి, జ్యోతి, గౌస్య, సక్కుబాయి,లక్ష్మమ్మ, నాగమణి, రాణి, పద్మ,సంపూర్ణ, శాంతి, తదితరులు పాల్గొన్నారు.
దామరచర్ల: దామరచర్లలోని రాష్ట్ర రహదారిపై ఆశాలు మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ అనుబంధం జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, సీఐటీయూ మండల కన్వీనర్‌ బైరం దయానంద్‌, ఆశావర్కర్స్‌ జిల్లా కమిటీ సభ్యులు జయమ్మ, ఆశావర్కర్లు ఇందిరా,పద్మ, కవిత, శారద, ఉమా తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ: ఆశాలకు నెలకు రూ.18 వేల వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నల్లా వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దేవరకొండ ఆర్డీఓ కార్యాలయం ముందు6 వ.రోజు ఆర్డీవో కార్యాలయం సమ్మె లో భాగంగా నిరసన ర్యాలీ నిర్వహించారు.స్థానిక బస్టాండ్‌ సమీపంలో మానవహారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు నాగటి నాగరాజు, రైతు సంఘం జిల్లా నాయకులు బిజిలి లింగయ్య, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు శైలు, చిట్టి, విమల, విజయ, లలిత, అంజమ్మ, మంజుల, వెంకటమ్మ,కళావతి పాల్గొన్నారు.
మర్రిగూడ: అంగన్వాడీఉద్యోగులు, ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలో 20 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు,ఆరు రోజులుగా ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు.వీరి డిమాండ్లు చాలా చిన్నవని ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల ప్రజాధనం వధా చేస్తున్న ప్రభుత్వానికి వీళ్ళ డిమాండ్లను నెరవేర్చడం పెద్ద కష్టం కాదన్నారు.అంతకుముందు సమ్మెకు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య సంఘీభావం తెలిపి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, బీజేపీ మండల అధ్యక్షుడు రాందాస్‌ శ్రీనివాస్‌, మాజీ జడ్పిటిసి మేతరి యాదయ్య, మాజీ ఎంపిటిసి వెంకటం పేట బాలయ్య, రవీందర్‌ రావు, జమ్ముల వెంకటేష్‌, తదితరులు, పాల్గొన్నారు.