
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని చారిత్రాత్మక కౌలాస్ కోట మీద జాతీయ జెండా ఎగరవేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎగురవేశారు. అనంతరం కౌలాస్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరం మాట్లాడుతూ.. సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన శుభదినాన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు..భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు అన అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాలు రాజకుటుమికులైన అనిత సింగ్, తదితరులు పాల్గొన్నారు.