– గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-కోట్‌పల్లి
మచ్చలేని నాయకుడు చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్‌రెడ్డి అని మండల అధ్యక్షుడు కష్ణ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ పార్టీ మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చేవెళ్ల గడ్డపై కొండ విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రావిరాల రవి, కోట్‌పల్లి ఎంపీటీసీ మహేష్ గౌడ్, జిన్నారం ఎంపీటీసీ బందయ్య, ప్రధాన కార్యదర్శులు జగదీష్, చంద్రయ్య, బూత్ అధ్యక్షులు బాల్ రాజు, శివకుమార్, నవాజుద్దీన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.