వంటావార్పు.. చెవిలో పువ్వు..

– దున్నపోతుకు వినతిపత్రం
– జీపీ కార్మికుల వినూత్న నిరసన
నవతెలంగాణ- విలేకరులు
ఉద్యోగ భద్రత, వేతనం పెంపు కోసం గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 19వ రోజుకు చేరుకుంది. సోమవారం పలు రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. వారికి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు సంఘీభావం తెలిపారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో జీపీ కార్మికుల సమ్మెకు మధ్యాహ్న భోజన సంఘం మండల కార్యదర్శి ఎర్రమళ్ల శాంతికుమారి మద్దతు తెలిపారు. పెన్‌పహాడ్‌ మండలంలో జీపీ కార్మికులు మోకాళ్ల మీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కోదాడ మండలంలో వంటావార్పు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలో జీపీ కార్మికులు రాస్తారోకో చేశారు. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముట్టడి చేసి
వంటావార్పు, చెవిలో పువ్వు..
దున్నపోతుకు వినతిపత్రం ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో జీపీ కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌లో భిక్షటన చేయగా.. పలు చోట్ల ర్యాలీలు చేపట్టారు. కార్మికుల సమ్మెకు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాలలో చేపట్టిన సమ్మెకు సీఐటీయూ, వ్యకాస నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జీపీ కార్మికులు దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. కందుకూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నుంచి దొడ్డి కొమురయ్య విగ్రహాం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దొడ్డి కొమురయ్య విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.