భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాలతో బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల, శ్రీ మహాత్మ హైస్కూల్ విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. తదుపరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మానవహారంగా ఏర్పడి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. దేశంలో జాతీయ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మండల కేంద్రాల్లో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల జీవిత గాథలు గుర్తుకు చేసుకొని దేశ అభివృద్ధికి పురః అంకితం ఇవ్వాలన్నారు. దేశభక్తిని చాటి చెప్పడంలో బీజేవైఎం ఎప్పుడు ముందుంటున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు వడ్లకొండ రవి, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె అనిల్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మంచాల సుమన్ యాదవ్, నాయకులు పెండ్యాల గణేష్, జక్కుల సందీప్, రాసాల రాకేష్, ఉడుత నాగరాజు, రాకేష్, సిద్దు, తదితరులు పాల్గొన్నారు.