రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

– ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-కోహెడ
మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆయా శాఖల అధికారులు, నాయకుల చేతులమీదుగా జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్‌ యువజన సంఘం, ఆటో యూనియన్‌, పద్మశాలీ సేవా సంఘం, అంగన్‌వాడీ సెంటర్‌లలో, ఐకెపీ కార్యాలయంలో, ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘంలో, మండల పరిషత్‌ కార్యాలయంలో, తహాశీల్దార్‌ కార్యాలయంలో, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలతో పాటు వివిధ కార్యాలయాలలో ఆయా అధికారుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్‌ మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల వీర మరణాలతో భారతదేశానికి నిరంకుశ బ్రిటిష్‌ ప్రభుత్వం నుండి విముక్తి లభించిందన్నారు. ఈ కార్యక్రమాలలో ఫ్యాక్స్‌ ఛైర్మన్‌ పెర్యాల దెవేందర్‌రావు, వైస్‌ ఎంపీపీ తడకల రాజిరెడ్డి, ఎంపీటీసీలు ఖమ్మం స్వరూప, పూల విజయ బాలయ్య, కోనె శేఖర్‌, వేముల శ్రీనివాస్‌, ఎంపీడీవో  మధుసూదన్‌, తహాశీల్దార్‌ సురేఖ, రైతుబంధు కోకన్వీనర్‌ మండల అధ్యక్షుడు పేర్యాల రాజేశ్వరరావు, డాక్టర్‌ నిమ్రా, ఏవో భోగేశ్వర్‌, బీఆర్‌ఎస్‌ మండల యూత్‌ అధ్యక్షుడు జాలిగం శంకర్‌, ఆయా శాఖల అధికారులు, నాయకులు, తదితరులు పాల్గోన్నారు.