రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

A fluttering three-moon flagనవతెలంగాణ – కోహెడ
కేంద్రంలోని  తహసీల్దార్ కార్యాలయం తో పాటు  మండల పరిషత్ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయా శాఖల అధికారుల చేతుల మీదుగా స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని  మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమాలలో తహసీల్దార్ సురేఖ, ఎంపీడిఓ కార్యాలయంలో ప్రత్యేక అధికారి హరీష్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండీ మహమూద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు డా. నిమ్రా తరుణమ్, మండలంలోని  అన్ని గ్రామాల్లోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆయా శాఖల అధికారులు, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే  కోహెడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో అధ్యక్షులు పేర్యాల దేవేందర్ రావు జాతీయ జెండా ఎగరవేశారు.  సహకార సంఘం ఉపాధ్యక్షులు బండారి బాల్ రాజు సహకార సంఘం కార్యవర్గ సభ్యులు మ్యాకాల సురేందర్ ,నీరటి దేవయ్య, కొండల్ రెడ్డి,సి ఈ ఓ ముంజ మల్లికార్జున్, మాజీ సర్పంచ్ దొమ్మాట జగన్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, పెరియాల రాజేశ్వరరావు,  సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.