ఉపాధ్యాయులకు ఆత్మీయ వీడ్కోలు..

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని నాచారం గ్రామంలో ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో గత 12 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా సేవలందించిన నాగరాజు, అలాగే అమీరాబాద్ లోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో 11 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడుగా సేవలందించిన  అలీలు  బదిలీపై వెళుతున్న నేపథ్యంలో వారిద్దరూ ఉపాధ్యాయులను మంగళవారం గ్రామస్తులు, విద్యార్థులు శాలువాలు, పులమాలతో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. పదేళ్లు ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధనలు చెప్పి తమ సొంత పిల్లలుగా చూసినట్లుగా తెలిపారు. పదేళ్లకు పైగా ఒకే పాఠశాలలో చదువులు చెప్పడంతో ఉపాధ్యాయులు గ్రామంలో యువతకు,ప్రజాప్రతినిధులకు, నాయకులకు, ముఖ్యంగా విద్యార్థుల నుంచి ప్రేమానురాగాలు పొందిన నేపథ్యంలో ఒకేసారి బాగ్వాదేహానికి గురైయ్యారు. విద్యార్థులు మాత్రం తమ గురువులు బదిలీపై వెళ్లడంతో కన్నీరు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, ఉపాధ్యాయులు,అంగన్ వాడి టీచర్లు లక్ష్మీ, విజయ, నాయకులు మావురపు వెంకన్న, తాటికొండ రాజయ్య, చేపూరి దేవరాజు, దొగ్గల సంపత్ ,కర్నూరి అశోక్ కుమ్మరి సది, కారోబార్ అజ్మీర్ పాషా, కోట శ్యాంసుందర్,  సాయికిరణ్ పాల్గొన్నారు.