ఉపాధ్యాయునికి ఆత్మీయ వీడ్కోలు..

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం ఉన్నత పాఠశాలలో12 ఏళ్ళు విధులు నిర్వహించి, ఇటీవల బదిలీపై త్రిపురారం మండలానికి బదిలీ పై వెళ్లిన సందర్బంగా రామన్నగూడెం గ్రామస్తులు  ఉపాధ్యాయుడు మేదరి దేవేందర్ ను ఉపాధ్యాయులు గ్రామస్తులు ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని శనివారం రామన్న గూడెం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా రామన్న గూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన మేదరి దేవేందర్ సేవలను కొనియాడారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల నమోదు విషయంలో  బాధ్యతగా విధులు నిర్వహించారని కొనియాడారు. తోటి ఉపాధ్యాయులతో జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామస్తులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మేదరి దేవేందర్, అంగన్వాడీ టీచర్ మేకల పద్మ, గ్రామస్తులు గుంటుక సైడిరెడ్డి, నక్కల మట్టరెడ్డి, వంగూరి గంగయ్య, తన్నీరు సాంబయ్య, సతీష్, పగడాల వెంకట్ రెడ్డి, నక్క ముత్యాలు , ఉడత మహేష్, నక్క వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.