ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం

నవతెలంగాణ – పెద్దవూర
ప్రజల ఆర్యోగం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు మండల వైద్యదికారి డాక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం మండలం లోని కోమటి కుంట తండా పంచాయతీ పరిధిలోని బాసోని బావి తండాలో ఉచిత వైద్య క్యాంపు నిర్వహించి మాట్లాడారు.బాసోని బావి తండాలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచిస్పందన వచ్చి న‌ట్లు తెలిపారు.గ్రామంలోని ప్రజలందరు వివిధ రకలైన వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకని వారికి ఉచితంగా గ్రామంలోని ప్రతి ఒక్కరికి బీపీ, షూగర్‌, ఈసీజీ, గుండె సబంధిత పరీక్షలు, లెన్స్​‍ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందజేశామని చెప్పారు.మొత్తం 85 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అందులో 14 మంది జ్వర బాధితులకు పరీక్షలు నిర్వహించామని అన్నారు.మరో 36 మందికి రక్త నమూనాలు నిర్వహించి నల్గొండ ప్రభుత్వం అసువత్రికి శాంపిల్స్ ను పంలించామని తెలిపారు. మరో 40 మంది వివిధ రాకాల నొప్పులతో బాధాడుతున్నారని వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంఓ దుర్గయ్య, సిబ్బంది వాసుదేవారెడ్డి,ఏఎన్ఎం విజయలక్ష్మి, రమావత్ శ్రీనివాస్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.