జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలోని టీఎస్ డబ్ల్యూఆర్ ఎస్ పాఠశాలలో 450 మంది విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని డిఎంహెచ్వో వసంత రావు సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గూర్చి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ పెంచలయ్య, డా రమణ, డా దివ్య శ్రీ, సిబ్బంది ఉన్నారు.