ఓటు హక్కును వినియోగించుకున్న స్వతంత్ర సమరయోధుడు

నవతెలంగాణ – ఆర్మూర్ 

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో  పట్టణానికి (పట్టుకరి)క్షత్రియ కులానికి చెందిన స్వాతంత్ర సమర యోధుడు దొండి జగ్గే శివదాస్ (93) సంవత్సరముల వయస్సు కల వృద్దుడు తన ఓటు హక్కును శుక్రవారం వారి స్వగృహంలో వినియోగించు కోవడం జరిగింది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అందరూ కూడా తమ ఓటు హక్కును తప్పనిసరి వినియోగించుకోవాలని వారు సందేశాన్ని ఇస్తూ, తన ఓటు హక్కుని వినియోగించుకోవడం చాలా ఆనందం గా ఉందని తెలిపారు.