– విద్యార్థుల సౌకర్యార్థం కోసం సెల్ టవర్ ని ఏర్పాటు చేయాలి..
నవతెలంగాణ -డిచ్ పల్లి
యూనివర్సిటీ హాస్టల్ మేస్ బిల్లులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని,హాస్టల్ విద్యార్థులపై మేస్ చార్జీల పేరిట అధిక భారాన్ని మోపుతున్నారని, సగటునా ప్రతి నెల ఒక విద్యార్థిపై ( 2000 నుండి 2300) వరకు భారం పడుతుందని, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ మహేందర్ రెడ్డి కి హాస్టల్లో నేలకోని ఉన్న సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ఎస్ ఎఫ్ ఐ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులపై మేస్ చార్జీల పేరిట అధిక భారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సగటునా ప్రతి నెల ఒక విద్యార్థిపై ( 2000 నుండి 2300) వరకు భారం పడుతుందని అన్నారు. మెస్ చార్జీల భారాన్ని తగ్గించాలని అన్నారు. అదేవిధంగా పౌష్టిక ఆహారాన్ని అందించడం లేదని, యూనివర్సిటీ హాస్టల్లో సరిగ్గా వైఫై రావడం లేదని వేంటనే అన్నారు. యూనివర్సిటీలో విద్యార్థుల సౌకర్యార్థం కోసం సెల్ టవర్ ని ఏర్పాటు చేయాలని విన్నవించారు. అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు హాస్టల్లను సందర్శించి సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు చిత్రు, యూనివర్సిటీ సహయ కార్యదర్శి పవన్, నాయకులు విక్రమ్, లక్ష్మణ్, తదితర నాయకులు పాల్గొన్నారు.