రంగంలోకి దిగిన నిధి

రంగంలోకి దిగిన నిధిశ్రీ సింహ కోడూరి, సత్య లీడ్‌ రోల్స్‌లో రితేష్‌ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్‌ హిట్‌ మూవీ ‘మత్తు వదలరా’. ఇప్పుడు అదే టీమ్‌ దీనికి సీక్వెల్‌గా ‘మత్తు వదలారా 2’ తో  ఎంటర్‌టైన్‌ చేయడానికి రెడీ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ  చిత్రంలో హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా నిధి పాత్రలో కనిపించనున్నారు. మంగళవారం ఫరియా అబ్దుల్లా ఫస్ట్‌ లుక్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో సునీల్‌, వెన్నెల కిషోర్‌,  అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్‌ రెడ్డి, గుండు సుదర్శన్‌ ముఖ్యైన పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 13న ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేసేందుకు మేకర్స్‌  సన్నాహాలు చేస్తున్నారు.  చిత్రానికి సంగీతం : కాల భైరవ, సినిమాటోగ్రఫీ : సురేష్‌ సారంగం, ఎడిటింగ్‌ : కార్తీక శ్రీనివాస్‌ ఆర్‌.