ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్, మహేష్ దత్తా, లక్ష్మి నవ్య నిర్మాతలుగా వస్తున్న ‘విద్య వాసుల అహం’ ఈనెల 17న ఆహాలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి మనికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. రాహుల్ విజరు, శివాని వీరిద్దరూ విద్య వాసులుగా ఏ మాత్రం వారి అహాన్ని తగ్గించుకోకుండా ఎలా పెళ్ళైన కొత్త కాపురాన్ని లీడ్ చేస్తున్నారు?, చివరికి ఆ ఈగోస్ నుండి ఎలా బయటకి వచ్చారు అనే కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన
పాత్రికేయుల సమావేశంలో డైరెక్టర్ మనికాంత్ గెల్లి మాట్లాడుతూ, ‘ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెంకీ స్క్రిప్ట్ రాయడం వల్లే నేను సినిమా చెయ్యగలిగాను. కళ్యాణీ మాలిక్ మంచి సపోర్ట్ ఇచ్చారు. అయనే హీరోయిన్ని, విష్ణు మూర్తి రోల్‌కి అవసరాల శ్రీనివాస్‌ని సజెస్ట్ చేశారు. ఈ సినిమాకి సోల్ మొత్తం మ్యూజిక్. కళ్యాణీ మాలిక్ 4 పాటలని నాలుగు విధాలుగా కంపోజ్ చేశారు’ అని తెలిపారు.
‘ఇదొక చిన్న క్యూట్ ఈగోస్ ఉండే ఫన్ ఫిలిం. సరదాగా హాయిగా సమ్మర్లో ఇంట్లో ఏసీ వేసుకుని ఆహాలో హ్యాపీగా ఫ్యామిలీతో చూసే సినిమా. కొత్తగా వచ్చే ప్రతి యాక్టర్‌కి లైఫ్‌లో కొన్ని సినిమాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అలా నాకు కూడా వెంకటేష్‌లా ఫ్యామిలీ స్టోరీస్ చెయ్యాలని ఉంది. ఒక రోజు ఫ్లైట్‌లో ఉన్నప్పుడు మనికాంత్ కాల్ చేసి, పీడిఎఫ్ సెండ్ చేశాడు, టైటిల్ చాలా గమ్మత్తుగా అనిపించింది. అప్పటికప్పుడు చదివి, కథ నచ్చి ఓకే చెప్పాను’ అని హీరో రాహుల్ విజరు చెప్పారు.
హీరోయిన్ శివాని మాట్లాడుతూ,”ఆహా’లో ఆల్రెడీ కోట బొమ్మాలి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ‘ఆహా’లోనే రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు నిజంగా ఇదొక లక్కీ ప్లాట్ఫారం. నాకు మనికాంత్ కథ చెప్పినప్పుడు హీరో ఎవరని అడిగాను. రాహుల్ విజరు అన్నారు. రాహుల్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. రాహుల్ మంచి రైటర్ కూడా. రాహుల్ ఓకే చేసాడు అంటే కథ బాగుంటుంది అని అర్థమైంది. నేను కూడా ఒకే చేశాను. ఈ కథ ఒప్పుకున్న 6 డేస్‌కి కోట బొమ్మాలి ఓకే అయ్యింది. అలా లాస్ట్ రెండు సంవత్సరాలుగా రాహుల్‌తోనే వర్క్ చేశాను. ఏ మాత్రం ఈగో లేని వ్యక్తి రాహుల్. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.