చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గ్యాంగ్ స్టర్’. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్‌లో రవి, నరసింహా సమర్పణలో ఈ చిత్రానికి కొరియోగ్రఫీ, ఎడిటింగ్, ఫైట్స్ అందించడమే కాకుండా నిర్మిస్తూ, దర్శకత్వం వహించారు చంద్రశేఖర్ రాథోడ్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రచయిత మామిడి హరికష్ణ మాట్లాడుతూ, ‘కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవాలి అని అన్నట్లు..చంద్రశేఖర్ రాథోడ్ తను హీరో కావాలి, ఫిలిం మేకర్ కావాలని కలకన్నాడు. ఈ చిత్రంతో ఆ కలను నిజం చేసుకున్నాడు. మేం ఈ సినిమా చూశాం. చాలా బాగుంది. ఇటీవల కాలంలో నాకు బాగా నచ్చిన టీజర్ ఈ మూవీదే. ఈ టీజర్‌ని కూడా తనే కట్ చేశాడు. ఖచ్చితంగా తన కష్టానికి ఫలితం ఉంటుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు చంద్రశేఖర్‌కి థ్యాంక్స్. 24 గంటలు కష్టపడేంత ప్యాషన్ సినిమా మీద ఉన్న వ్యక్తి ఆయన. ఈ సినిమా బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నా’ అని హీరోయిన్ కాశ్వీ కాంచన్ చెప్పారు. హీరో, దర్శకుడు, నిర్మాత చంద్రశేఖర్ రాథోడ్ మాట్లాడుతూ, ‘మనం ఏదైనా బలంగా అనుకుంటే జరిగి తీరుతుంది అనేందుకు ఈ సినిమా ఎగ్జాంపుల్. సినిమా టైటిల్స్‌లో నాలుగైదు పేర్లు నావే ఉండాలని నేను అనుకోలేదు. డబ్బులు లేక ఫైట్స్, ఎడిటింగ్, కొరియోగ్రఫీ నేనే చేసుకున్నా. ఈ సినిమా టీజర్‌ను విజయేంద్రప్రసాద్‌కి చూపించాను. ఆయన హగ్ చేసుకుని టీజర్ బాగుందంటూ ఆశీర్వదించారు. నా ముందే దిల్ రాజుకి ఫోన్ చేసి ఈ సినిమా టీజర్ చూశాను బాగుంది. మీరూ చూడండి అని అడిగారు. దిల్ రాజు టీజర్ చూసి బాగుందన్నారు. వారి సంస్థలో మా సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. వారి టీమ్ చూసి డిసైడ్ చేయబోతున్నారు. దర్శకుడు రాజమౌళి కూడా మా సినిమా టీజర్ చూస్తారని ఆశిస్తున్నా. త్వరలోనే మీ ముందుకు మా సినిమాను తీసుకు రాబోతున్నాం. కల్కితో పాటు మా మూవీ టీజర్ కొన్ని థియేటర్స్‌లో ప్లే చేస్తున్నాం’ అని అన్నారు.