
– ఎమ్మెల్యే దృష్టిలో పడేందుకు హడావిడి చేసిన అధికారులు…?
– ఐదు సంవత్సరాలుగా లేని ఆర్భాటం…… హడావిడి చేసి హడలెత్తించారు
– తీరుమార్చుకోని అధికారులు….
– -గతంలో నడిపించినట్లుగానే కుటిల యత్నాలు …..???
– సర్వసభ్య సమావేశానికి నివేదికలో సూచించిన శాఖల అధికారులు హాజరైనప్పటికీ తమ శాఖల నివేదికలను చదవడానికి అవకాశం ఇవ్వలేదని గుసగుసలు ఆడుకున్న అధికారులు…????
– ఐదారు శాఖలనివేదికను చదివి సమావేశాన్ని ముగించారు….మిగతా శాఖల సంగతి ఏంటని అడిగే ప్రజాప్రతినిధులు లేరు…
– ఇదేమి సోద్యమని చెవులు కోరుకుంటున్న వివిధ వర్గాల ప్రజలు మేధావులు
– తూతూ మంత్రంగా మండల సర్వసభ్య సమావేశం
ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-చివ్వేంల : మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది…. సర్వసభ్య సమావేశం అందర్నీ ఆలోచింపజేసే సర్వసభ్య సమావేశంగా నిర్వహించబడడం ప్రజాప్రతినిధులను, మంత్రముగ్ధుల్ని చేసింది… ఈ సర్వసభ్య సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పది సంవత్సరాలు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొనడం విశేషం. ఎన్నడు సర్వసభ్య సమావేశాలలో పాల్గొని మాజీ మంత్రి సర్వసభ్య సమావేశానికి వస్తున్నాడని తెలుసుకొని ఐదు సంవత్సరాలలో లేని ఆర్భాటం , హడావిడి చేసి అధికారులు హడలెత్తించారు. గత ఐదు సంవత్సరాలలో సర్వసభ్య సమావేశాలలో చుట్టపు చూపుగా వచ్చి మొహం చూపించి వెళ్లిపోయిన ప్రజాప్రతినిధులు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రావడంతో సమావేశం చివరి వరకు ఉండడం ఐదు సంవత్సరాలలో ఒక్కసారి కూడా రాని ప్రజాప్రతినిధులు చివరిసారి సమావేశం కావడం తో హాజరై హడావిడి చేయడం ఆశ్చర్యంగా కనిపించింది.. .. సర్వసభ్య సమావేశంలో 21 శాఖలకు సంబంధించి అజెండా అంశాలు ఉన్నప్పటికీ ఐదారు శాఖల నివేదికలను సమావేశంలో చదివి వినిపించినట్లు,సమాచారం..సమావే శానికి హాజరైన తమ నివేదికలను సభలో చదవడానికి అవకాశం ఇవ్వకపోవడం పట్ల అధికారులు గుసగుసలాడుకున్నారు. మిగతా శాఖల సంగతి ఏంటని అడిగే ప్రజా ప్రతినిధులు లేకపోవడం విశేషం. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసారని ఆరోపణలు వినిపిస్తున్నాయి . సమావేశం మొత్తంలో అధికారులు మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే మెప్పుకోసం విశ్వ ప్రయత్నాలు చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది….
పచ్చదనాన్ని పెంపొందించడంలో స్థానిక ప్రజాప్రతినిధుల కృషి ఎనలేనిది….
గ్రామాలలో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలో జరిగిందని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గ్రామాలలో శాశ్వతంగా గుర్తుండేలా జరిగిన అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పనితీరు అమోఘం అనీ కొనియాడారు.దేశంలో ఏ అవార్డు ప్రకటించిన తెలంగాణకు వరించిన అవార్డులే దీనికి నిదర్శనం అన్నారు. ఎన్ని అవార్డులు ప్రకటించినా మొత్తానికి మొత్తం తెలంగాణనే ఆక్రమిస్తుండడంతో దేశాన్ని జోన్లుగా విభజించేలా
కేంద్ర ప్రభుత్వం పాలసీనే మార్పు చేసే విధంగా స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు ఉందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ గ్రామాలకు ఇక్కడి పట్టణాలే పోటీ అన్నారు.
పట్టణాలతో పోటీపడేలా గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు.పచ్చదనాన్ని పెంపొందించడంలో స్థానిక ప్రజాప్రతినిధుల కృషి ఎనలేనిదన్న ఆయన ప్రభుత్వం ఉద్యమంలా కొనసాగించిన హరితహారం కారణంగా మూడు శాతం ఉన్న అడవులు ఏడు శాతానికి పెరిగాయి అన్నారు. దీనిలో స్థానిక నాయకత్వాన్నిదే ప్రధాన భూమిక అన్నారు. సేవ చేసే వారిని ప్రజలు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరన్న జగదీష్ రెడ్డి,
ప్రజల ఆశీస్సులతో మరోసారి ప్రజాప్రతినిధులుగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం మరో రెండు రోజుల్లో పదవీకాలం పూర్తి అవుతున్న సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్ లను జగదీష్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్, జడ్పిటిసి సంజీవ నాయక్,వైస్ ఎంపిపి జీవన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సుధీర్ రావు,ఎంపీడీవో లక్ష్మి, ఎంపీఓ గోపి, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.