సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె ఉదృతం

– నిలిచిపోయిన కేజీబీవీలో విద్యాబోధన
– భవిత సెంటర్లు బంద్
– సమస్యలు పరిష్కరించే వరకు ఉపాధ్యాయుల సంఘాల మద్దతు
నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు మున్సిపల్ ఆఫీస్ వద్ద  నిర్వహిస్తున్న సమ్మె కొనసాగుతుంది. తయు నాలుగు రోజుల నిరసన దీక్షలకు  అధికారులు రాష్ట్ర నాయకులతో చర్చలు విఫలం కావడంతో రెండవ రోజు సమ్మె మరింత ఉధృతంగా మారిందని సమగ్ర శిక్ష ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వనరుల కేంద్రం  తాళాలు పడ్డాయని, సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం వలన  కేజీబీవీలో విద్యాబోధన ఆగిపోయింది, ప్రత్యేక అవసరాల కోసం ఏర్పరిచిన  విద్యా బోధన వారి అవసరాలను తీర్చే భవిత సెంటర్లు బంద్ అయినాయన్నారు.  తమ సమస్యల పట్ల స్పందించిన సీఎం ఇచ్చిన హామీకి  సంబంధం లేకపోవడం బాధాకరమన్నారు. విద్యాశాఖలో కీలకంగా పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడంతో తమ పని ఎంత ముఖ్యమో కార్యాలయాలు బంద్ రావడమే దీనికి నిదర్శనం అన్నారు. రేపు జరగబోయే సమ్మెలో తమ సేవల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. సమ్మెకు మద్దతుగా తెలపడానికి వచ్చిన టిఆర్టియు జిల్లా  అధ్యక్షులు కుషాల్, డి టి ఎఫ్ జనరల్ సెక్రటరీ దేవుల మాట్లాడుతూ మీ సమస్యలు పరిష్కారం, మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించదగిన వేనని, సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ అయ్యేవరకు  వెంటనే పే స్కేల్ అమలు చేసేంతవరకు మీ పోరాటాలకు మేము  మద్దతుగా ఉంటామని తెలిపారు అన్నారు. మీ ఉద్యమ తీవ్రత మాకు అర్థమైందని  మీరు లేకుంటే విద్యా వ్యవస్థ నడవడం సాధ్యం కాదని ఇట్టి విషయాన్ని  అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, శ్యాం కుమార్, సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీ సంపత్, నాయకులు శ్రీధర్ కుమార్,రాములు, సంతోష్ రెడ్డి, శిల్ప,లావణ్య,సాయిలు, శైలజా, మాధవి ,అజిద్, శ్రీనివాస్, రమేష్,కాళిదాసు,కృష్ణ,శ్రీకాంత్, బన్సీలాల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.