ఈ నెల 15 నుండి 30 వరకు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సాలను అంగరంగ వైభంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం గ్రామంలోని ఆలయం నుండి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవ మూర్తులను మహిళల కోలటాలతో వైభోవపేతంగా ఏకశిల గుట్టపై ఆలయానికి శోభాయాత్ర నిర్వహించారు.గ్రామంలో మహిళలకు శోభాయాత్రకు పెద్ద ఎత్తున తరలిరావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.ఆలయ ఉద్యోగులు,ఉత్సవ కమిటీ సభ్యులు,గ్రామస్తులు హజరవుతున్నారు.
19న తిరుకల్యాణోత్సవం..
బ్రహ్మోత్సాలో భాగంగా ఈ నెల 19న ఏకశిల గుట్టపై ఆలయ అవరణం వద్ద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణోత్సవం అధికారులు నిర్వహించనున్నారు.23న శకటోత్సవం(గుట్ట చుట్టూ బండ్లు తిరుగుట),24న రథోత్సవం నిర్వహించనున్నారు.