కష్టపడి చదివినప్పుడే బంగారు భవిష్యత్తు

నవతెలంగాణ – భిక్కనూర్
ప్రతి విద్యార్థి విద్యార్థి దశలో కష్టపడి చదివినప్పుడే బంగారు భవిష్యత్తు ఉంటుందని మార్కెట్ కమిటీ డైరెక్టర్ పురాం రాజమౌళి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పదవ తరగతి పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భిక్నూర్‌ పట్టణ సర్పంచ్ తునికి వేణు, ఉప సర్పంచ్ బోడ నరేష్, ఎంపీటీసీలు సువర్ణ ప్రభాకర్, చంద్రకళ రాములు, ఎస్ఎంసి వైస్ చైర్మన్ కుమార్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉదయ్ దత్, హనుమంత్ రెడ్డి, యాదగిరి, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.