మంచి కుటుంబ కథా చిత్రం

A good family filmరిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో,హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కష్ణగాడు అంటే ఒక రేంజ్‌’. శ్రీ తేజస్‌ ప్రొడక్షన్‌ ప్రై.లి బ్యానర్‌ పై పెట్లా క ష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్‌ మూర్తి సంయుక్తంగా నిర్మించారు. రాజేష్‌ దొండపాటి తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. ఈనెల 4న ఈ చిత్రాన్ని గ్రాండ్‌ లెవల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్‌ మాట్లాడుతూ, ‘చక్కటి కుటుంబ కథా చిత్రంగా సినిమాను విజయవంతంగా పూర్తి చేసిన టీంకి శుభాకాంక్షలు. మా వరంగల్‌ వాళ్లకి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని అన్నారు.
‘సినిమా ద్వారా మనుషుల్ని కదలిం చొచ్చు. ప్రతి మనిషి జీవితంలో కథలుంటాయి. క ష్ణ అనే యువకుడి కథే ఇది. తండ్రి కలను నేరవేర్చటానికి కొడుకు పడ్డ కష్టం. తన ప్రేమ, భావోద్వేగాలను అందంగా చూపించే ప్రయత్నమే ఈ సినిమా’ అని నిర్మాత పెట్లా రఘురామ్‌ మూర్తి చెప్పారు.
డైరెక్టర్‌ రాజేష్‌ దొండపాటి మాట్లాడుతూ, ‘మా నిర్మాతకు మంచి గట్స్‌ ఉన్నాయి. మమ్మల్ని నమ్మి మాకు చాన్స్‌ ఇచ్చారు. సినిమా అందర్నీ అలరిస్తుంది’ అని తెలిపారు.
రిష్వి తిమ్మరాజు మాట్లాడుతూ, ‘సినిమా చూడండి. నచ్చితే పది మందికి చెప్పండి’ అని అన్నారు. విస్మయ శ్రీ మాట్లాడుతూ, ‘సత్య లాంటి మంచి పాత్ర మళ్లీ వస్తుందో లేదో తెలియదు. నన్ను నేను నిరూపించుకునేందుకు ఈ పాత్ర దొరికింది’ అని తెలిపారు.