అమేజింగ్ గ్లోబల్ మూవీ మేకర్స్ పతాకంపై ‘విక్టర్ ది నెక్స్ట్ గాడ్’ టైటిల్ లోగో లాంచ్ వేడుక గురువారం ఫిల్మ్ ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు సుమన్ ఈ చిత్ర టైటిల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రీతమ్ మాట్లాడుతూ, ‘ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఏడు దేశాల్లో షూటింగ్ నిర్వహిస్తాం. 200 నటీనటులను అన్నీ దేశాల నుంచి తీసుకుంటాం’ అని తెలిపారు. ‘హిట్ అయితే పెద్ద సినిమా, ఫట్ అయితే చిన్న సినిమా.. అంతే కానీ పెద్ద చిన్న సినిమాలనేవి ఉండవు. ఈ సినిమాలో 200 మందికి అవకాశం ఉందన్నారు. చాలా సంతోషం. నూతన టెక్నీషియన్స్‌కు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలి’ అని సుమన్ చెప్పారు. ఈ చిత్రానికి డి ఓ పి: జాకీ, మ్యూజిక్: రమేష్ ముక్కెర, స్క్రిప్ట్: జి. సంతోష్ కుమార్, సినిమాటోగ్రఫీ: రవి, ఫైట్స్ : హరి, ఆర్ట్: వర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఏ.వర్మ.