మాట నిలబెట్టుకున్న ప్రభుత్వ సలహాదారుడు

A government advisor who kept his wordనవతెలంగాణ – కంఠేశ్వర్ 
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో పట్టణ, అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల్లో ఓటమిపాలైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట నిలబెట్టుకున్నారు. SDF (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) ద్వారా పట్టణంలో పలు డివిజన్ లలో సిసి రోడ్ డ్రైనేజ్ పలు కమ్యూనిటీలకు కాంపౌండ్ వాల్ అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి తో చర్చించి వారి ద్వారా  10 కోట్ల రూపాయలు పట్టణ అభివృద్ధి కోసం నిధులు తేవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరిగింది అదేవిధంగా మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణం 500 కి గ్యాస్ సిలిండర్ అందించి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు వాగ్దానాల్లో ఐదు నెరవేర్చాం. త్వరలో పేదలందరికీ ఇంద్రమ్మ ఇల్లు ప్లాటు వున్న వాళ్లకి కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. నిజామాబాద్ పట్టణాన్ని అమృత్ నిధుల ద్వారా 300 కోట్ల రూపాయలు పట్టణానికి తీసుకువచ్చి నీటి సమస్య,  అండర్ గ్రౌండ్ డ్రైనేజ్  సమస్య తీర్చి స్మార్ట్  సిటీగా తీర్చి దిద్దుతానన్నారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో పలువురు కార్పొరేటర్లు డివిజన్ ప్రజలు కార్యకర్తలు నాయకులు షబ్బీర్ అలీ ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.