ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ని ఏర్పాటు చేయాలి

– పసుల అశోక్ యాదవ్..
నవతెలంగాణ-నూతనకల్ : మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ కు గురువారం మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ మండలంలోని 17 గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఇంటర్ విద్యను అభ్యసించడానికి చాలా దూర ప్రాంతాలకు వెళ్లడం జరుగుతుందనీ,ప్రవేట్ జూనియర్ కళాశాలలో అధిక ఫీజుల వలన పేద విద్యార్థులు విద్యకు దూరం కావడం జరుగుతుందనీ,పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కొరకు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు.దానికి ఎమ్మెల్యే సామేల్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బొల్క సైదులు,వాసుదేవ రెడ్డి,జటంగి గణేష్,మల్లయ్య,ఇరుగు కిరణ్, నెల్లుట్ల మహేష్,మోహన్ నాయక్, మరికంటి అశోక్, బంటు బద్రి, క్రాంతి, ప్రవీణ్, పాల్వాయి నాగరాజు, దిలీప్ తదితర నాయకులు పాల్గొన్నారు.