కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్న ప్రభుత్వ అధికార దంపతులు 

Government official couple receiving certificates of appreciation at the hands of the Collectorనవతెలంగాణ – జక్రాన్ పల్లి 
కలెక్టర్ చేతుల మీదుగా ప్రభుత్వ అధికార దంపతులు ఆదివారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రశాంత పత్రం అందుకోవడం సేవకు నిదర్శంగా భావిస్తారు. ఓకే జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తూ భార్య భర్తలు కలెక్టర్ల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకోవడం శ్రమకు తగ్గ ప్రతిఫలం తగ్గిందని ఆ దంపతులు అంటున్నారు. జక్రాన్ పల్లి మండల   కేంద్రంలో ఐకెపి కార్యాలయంలో పనిచేస్తున్న బుఖ్య రాములు జక్రాన్ పల్లి క్లస్టర్ లో మహిళా సంఘాలకు అన్ని విధాలుగా బ్యాంకు రుణాలు శ్రీనిధి రుణాలు 100 శాతం రుణాలు అందించి  టార్గెట్ ను పూర్తి చేశారు. అదేవిధంగా డిచ్చిపల్లి మండలం గ్రేడ్ వన్ అంగన్వాడి సూపర్వైజర్ గా పనిచేస్తున్న ముఖ్య బుజ్జి డిచ్పల్లి సెక్టార్లో మండలంలో నడిపెల్లి క్లస్టర్ పనిచేస్తూ, ధర్పల్లి మండలంలోని సెక్టర్లు విధులు నిర్వహిస్తూ ఇరువురు భార్యాభర్తలు ఆదివారం కలెక్టర్ చేతుల మీద ప్రశంసా పత్రాలను అందుకున్నారు. వీరిని సంబంధిత శాఖ అధికారులు అభినందించారు.