మొరపెట్టుకున్న.. ప్రభుత్వం ఆదరించడంలేదు 

– ప్రభుత్వ తీరుపై గ్రామ పంచాయతీ కార్మికుల అసహనం
– ప్రభుత్వ తీరుకు నిరసనగా అంబేడ్కర్ విగ్రహనికి వినతిపత్రమందజేత
– మండల కేంద్రంలో పంచాయతీ కార్మికుల నిరసన ర్యాలీ
నవతెలంగాణ-బెజ్జంకి
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది అధికశాతం బడుగుబలహీన వర్గాల ప్రజలేనని..ఎన్నో ఎండ్లుగా నెలకొన్న పంచాయతీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిచాలని పలుమార్లు మొరపెట్టుకున్న ఆదరించడం లేదని గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ అవరణం వద్ద చేపట్టిన నిరవధిక సమ్మె శిభిరం నుండి ప్రధాన రోడ్లపై అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో అలసత్వం వహిస్తోందని అంబేడ్కర్ విగ్రహనికి గ్రామ పంచాయతీ కార్మికులు వినతిపత్రమందజేశారు.గ్రామ పంచాయతీ కార్మికుల జీవనానికి గుదిబండగా మారిన 51 జీవోను ప్రభుత్వం సవరించి..క్రమబద్ధీకరణ చేయాలని గ్రామ పంచాయతీ కార్మికుల సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు బోనగిరి లక్ష్మన్ డిమాండ్ చేశారు.మండలంలోని అయా గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.