– మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
– రూ.17 లక్షల 50 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-కందుకూరు
సీఎంఆర్‌ఎఫ్ నిధులు నిరుపేద ప్రజలకు సరైన సమయంలో అందరికీ అందడం లేదని ప్ర భుత్వం పేదలపై చిన్నచూపు చూస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించా రు. సీఎంఆర్‌ఎఫ్ రూ.17 లక్షల 50 వేల చెక్కు లను కందుకూరు మండల లబ్దిదారులకు ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయం మీర్‌పేట్ జిల్లాల గూ డలో సోమవారం పంపిణ చేశారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ..66 మందికి సీఎం ఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారని తెలిపారు. ప్రభు త్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అ మలు చేయాలని కోరారు. మెడికల్ కళాశాల, 400 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ రైతులందరికీ వర్తించడం లేదన్నారు. గ్యాస్, వి ద్యుత్, సమస్యలున్నాయని సమస్యలన్నీ పరిష్క రించి న్యాయం చేయాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశా మని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల్ పార్టీ అధ్యక్షులు మన్నె జయేం దర్, సింగల్ విండో చైర్మెన్ చంద్రశేఖర్, వైస్ చైర్మెన్ విజయేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్లు సురసాని సురేందర్ రెడ్డి, గంగాపురం లక్ష్మీనరసింహ రెడ్డి, సురసని రాజశేఖర్ రెడ్డి, మం డల్ వర్ింగ్ ప్రెసిడెంట్ మెగానాథ్ రెడ్డి, మాజీ సర్పంచులు కాసుల రామకృష్ణారెడ్డి, గోవర్ధన్, కాకి ఇందిరా దశరథ, జ్యోతిచంద్రశేఖర్, నందీశ్వర్, మా జీ ఎంపీటీసీలు ఇందిరా దేవేందర్, మాజీ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్ రెడ్డి, ఎస్సి సెల్ అధ్యక్షులు సామయ్య, డైరెక్టర్లు శేఖర్ రెడ్డి, పొట్టి ఆనంద్, ప్రకాష్ రెడ్డి, పిట్టల పాండు పాల్గొన్నారు.