100 రోజుల్లో ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా ప్రభుత్వం నుండి తప్పుకోవాలని మండల బీఆర్ఎస్ నాయకుడు జంగిటి శంకర్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు,గ్యారంటీల అమలు చేతకాకనే బీఆర్ఎస్ పార్టీపై,మాజీ మంత్రి తన్నీర్ హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని శంకర్ విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలని లేనిపక్షంలో పరిపాలన నుండి ప్రభుత్వం తప్పుకోవాలని శంకర్ డిమాండ్ చేశారు.