ఆలూర్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ  – ఆర్మూర్
ఆలూర్ కేంద్రంలో గల జిల్లా పరిషత్  హై స్కూల్  1997-98 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 25  సంవత్సరాల తరువాత ఒక్కచోట కలుసుకొని వారి పాత జ్ఞాపకాలు, మధురాను స్మృతులనుగుర్తు చేసుకుని నెమరు వేసుకుంటూ సోమవారం పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ సమ్మేళన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించినారు. ముందుగా పూర్వ విద్యార్థులందరూ ప్రస్తుత జీవిత స్థితి గతులను ఒకరినొకరు తెలుసుకుంటూ ఆత్మీయంగా ఆనందంతో గడిపారు.వారు చదువుకున్న పాఠశాల యాజమాన్యం కు ఎంతో కృతజ్ఞతలను తెలిపారు.చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా ముక్కెర విజయ్ మాట్లాడుతూ  ఇలాంటి స్నేహ బంధం కలకాలం కొనసాగాలని కోరుకున్నారు.దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం విద్యావ్యవస్థలో ఉన్న పరిస్థితులు నేటి పరిస్థితులు పోల్చుతూ సందేశం అందించారు. అనంతరం పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ సందర్భంగా  కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమం లో ముక్కెర విజయ్, నాడీశరం మల్లయ్య, పవన్, గంగారెడ్డి, నరేందర్, రామకృష్ణ, రాకేష్, నారాయణ, చిరంజీవి,గోపి, రణధీర్ శర్మ, మమతా,శ్రీలత,  రేణుక, వనిత తదితరులు పాల్గొన్నారు.