ఆదిలాబాద్ లో ఘనంగా భోగి పండుగ..

Bhogi festival in Adilabad
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
భోగి పండుగ రోజున ఉదయమంతా భోగి మంటలతో సందడిగా గడిపితే.. సాయంత్రం వేళలో చిన్నారుల తలపై భోగి పళ్లు పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ పిల్లలపై తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు చిన్నారుల తలపై భోగి పళ్లను పోసి ఆశీస్సులు అందజేశారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని వాల్మీకి నగర్ లోని సాదుల అశోక్ నివాసంలో భోగి పళ్ళ పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. చుట్టూ పక్కల వారు వచ్చి సందడి చేశారు. తమ చిన్నారుల తల మీద భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వాళ్ళు వారిని ఆశీర్వదించారు. రేగు పండ్లతో పాటు అందులో బంతి, చేమంతి పూల రెక్కలు, నాణేలు వేసి హారతులిచ్చారు.