
యాదగిరిగుట్ట బీర్ల నిలయం. మంగళవారం ముఖ్యఅతిథి ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బూడిద నాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సహృదయ అనాధ వృద్ధాశ్రమం రాయగిరి లో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బందరపు బిక్షపతి గౌడ్, కౌన్సిలర్ ముక్కర్ల మల్లేష్, భరత్ గౌడ్, బూడిద భాస్కర్, నరసింహ, బూడిద మధు తదితరులు పాల్గొన్నారు.