నవతెలంగాణ- బాలానగర్
రాష్ట్ర టీఆర్‌ఎస్ నాయకుడు కేతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ జరుపుల లక్ష్మణ్ నాయక్ జన్మదిన వేడుకలు బాలానగర్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై బస్టాండ్ కూడాలి వద్ద మంగళవారం జన్మదిన వేడుకలు కార్యకర్తలు అభిమానులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి మాజీ సర్పంచులు ఎంపీటీసీలు,జడ్పీటీసీ జరుపుల కళ్యాణి. డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు,మండల పరిషత్ ఉపాధ్యక్షులు వెంకటచారి, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి. మోతీగనాపూర్ ఎంపీటీసీ ప్రతాప్ రెడ్డి, నేరాలపల్లి ఎంపీటీసీ లింగు నాయక్, సింగిల్ విండో మాజీ చైర్మన్ వెంకట్ రాములు గౌడ్, శ్రీధర్ గౌడ్, కేతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సుధాకర్ రావు, వివిధ గ్రామాల నుంచి గిరిజనులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రాజాపూర్ మండలం కుర్ర తండా కు చెందిన హథిరాం జన్మదిన వేడుకలు హిల్ పార్క్ ఆవరణలో ఘనంగా జరిగాయి పలువురు గిరిజన నాయకులు జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.