
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఉత్సవాలు పురస్కరించుకుని మండలంలోని చిన్నతూoడ్ల,దుబ్బపేట గ్రామాల పరిధిలో ఉన్న సమ్మక్క సారలమ్మ దుబ్బజాతర ఈ నెల 21,22న వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే జాతర ముగిసిన వారం తరువాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తిరుగువారం నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను ముస్తాబు చేసి అమ్మవార్లకు సందర్శకులు మొక్కులు చెల్లించారు.అనవాయిదిగా జాతరతోపాటు తిరుగువారం జాతరను నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ ఛైర్మన్ కోట లక్ష్మయ్య తెలిపారు. అయితే జాతర ముగిసిన నాలుగు రోజుల్లో సమ్మక్క సారలమ్మ ఆవరణలో పులి సంచారం చేసినట్లుగా పులి అడుగుల ఆనవాళ్లు కనిపించినట్లుగా వివరించారు.